GDP Statistics : మన దేశ జీడీపీ వృద్ధి ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు అయింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 8.4%కి పెరిగింది. తయారీ-మైనింగ్ రంగాల మెరుగైన పనితీరు కారణంగా GDP Statistics లో ఈ పెరుగుదల కనిపించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను విడుదల చేసింది. గత త్రైమాసికంలో జిడిపి 7.6 శాతంగా ఉంది. బలమైన పట్టణ వినియోగం, తయారీ – అధిక ప్రభుత్వ వ్యయం కారణంగా ఊహించిన దాని కంటే అధిక వృద్ధి కనిపించింది. ఒక సంవత్సరం క్రితం, అంటే 2022-23 మూడవ త్రైమాసికంలో, GDP కేవలం 4.5% మాత్రమే పెరిగింది. జిడిపి వృద్ధి(GDP Statistics) ఆర్బిఐ అంచనా కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. మూడో త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బిఐ అంచనా వేసింది. కానీ, వాస్తవానికి అది బాగా పెరిగింది.
పూర్తిగా చదవండి..GDP Statistics : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే..
జీడీపీ వృద్ధి ఆర్బీఐ గత అంచనాల కంటే ఎక్కువగా ఉంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ ఎక్కువ వృద్ధి కనిపించింది. స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 8.4%కి పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను విడుదల చేసింది
Translate this News: