Gold Rate today: బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనేఉంటాయి. సాధారణంగా పెరగడమే నెల రోజుల క్రితం వరకూ చూస్తూ వచ్చాము. అయితే, ఫిబ్రవరి నెలలో మాత్రం ఎక్కువగా బంగారం తగ్గుదలనే చూపించింది. ఇక గత నాలుగు రోజలుగా వరుసగా బంగారం ధరలు కాస్త కాస్త తగ్గుతూనే ఉన్నాయి. పెద్దగా ఎక్కువ కాకున్నా.. 100 నుంచి 200 రూపాయల మధ్యలో బంగారం ధరలు తగ్గడం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈరోజు అంటే మార్చి 1న బంగారం ధరల్లో స్థిరత్వం కనిపించింది. బంగారం ధరల(Gold Rate today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల తగ్గుదల.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఈరోజు అంటే మార్చి 1న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. అయితే, దేశీయంగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. ఈరోజు అంటే శుక్రవారం (మార్చి 1) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate today: బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్..
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు మార్పులు లేకుండా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,590ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.75,700 వద్ద ఉంది.
Translate this News: