Maha Shivaratri 2024 : మహాశివరాత్రి(Maha Shivaratri) రోజున చాలామంది ఉపవాసాలు ఉంటూ శివయ్య(Lord Shiva) కు ప్రత్యేక పూజలు చేస్తారు. శివుని రూపం చూసేందుకు మిగతా దేవుళ్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. పరమశివుడు మెడలో ఎప్పుడూ పాముని మాలలా ధరిస్తాడు. అసలు అలా ధరించడానికి కారణమేంటి?, మెడలో ఉన్న పాము పేరేంటి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటాయి. క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఇవాళే మహాశివరాత్రి . ఈ రోజున శివుడు, పార్వతీదేవి కల్యాణం జరిపిస్తారు.
పూర్తిగా చదవండి..Maha Shivaratri : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా?
శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు.
Translate this News: