Rakul Preeth – Jackky Bhagnani Wedding Video: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నెల ఫిబ్రవరి 21న నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ఈమె వివాహం ఘనంగా జరిగింది. గోవాలోని ఐటీసీ గ్రాండ్ (ITC Grand Goa) రిసార్ట్ లో జరిగిన రకుల్, జాకీ పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబ, సభ్యులు, బంధువులు, పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో శిల్పా శెట్టి, అనన్య పాండే, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ కొత్త జంటకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కూడా రకుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా రకుల్ షేర్ చేసిన ఆమె పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి..Rakul Preeth Wedding Video: వావ్..! సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఫిబ్రవరి 21న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. సినిమాను మించిపోయేలా స్టన్నింగ్ విజువల్స్ తో వీరి పెళ్లి వీడియో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
Translate this News: