Anant Ambani Pre Wedding : ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ‘మన్ కీ బాత్'(Mann Ki Baat) 107వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ- ‘ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నాయి. ఇది అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాలు జరుపుకుంటే దేశ సొమ్ము దేశంలోనే ఉంటుంది. దీనివల్ల చిన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుంది.’ అని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదిగో దానిని స్ఫూర్తిగా తీసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు MD ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఆయన తన చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. మూడురోజులకు సంబంధించి ఈవెంట్స్ వివరాలతో ఇన్విటేషన్స్ కూడా ఇప్పటికే అతిథులకు చేరిపోయాయి. ప్రపంచంలోనే 10వ అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి. దానికి సంబంధించిన ముందస్తు వేడుకలు.. మరి సహజంగానే అపర కుబేరులు.. వ్యాపార దిగ్గజాలు తరలి వస్తారు కదా. ఇదిగో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వస్తారని భావిస్తున్న అతిథుల లిస్ట్..
పూర్తిగా చదవండి..Anant Ambani Pre Wedding : అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్ళికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3 వరకూ జరగనున్నాయి. దీనికోసం దేశ విదేశాల నుంచి ప్రముఖ వ్యాపార వేత్తలు.. రాజకీయనాయకులు.. సెలబ్రిటీలు దాదాపుగా 1000 మంది వరకూ హాజరు కానున్నారు.
Translate this News: