Shanmukh Jaswanth Arrest: ఒక కేసు కోసం వెళితే మరో కేసు దొరికింది పోలీసులకు. అన్నకోసం ఎంక్వయిరీకి వెళితే.. తమ్ముడు డ్రగ్స్ తో దొరికాడు. అవును.. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జాస్వంత్ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. డ్రగ్స్ తో సోదరుడి ఇంట్లో షణ్ముఖ్ ను పోలీసులు పట్టుకున్నారు. నిజానికి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అన్న సంపత్ వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. సంపత్ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతొ మోసం చేసినట్టు కంప్లైంట్ వచ్చింది పోలీసులకు. ఒకరిని ప్రేమించి మోసం చేసి మరొక అమ్మాయితో పెళ్ళికి రెడీ అయ్యాడు సంపత్. మరో వారం రోజుల్లో సంపత్ పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో సంపత్ మోసం చేసిన యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు విచారణ కోసం సంపత్ ఫ్లాట్ కు వెళ్లారు. అయితే, అక్కడ వారికీ డ్రగ్స్ తో షణ్ముఖ్ పట్టుబడ్డాడు. దీంతో షణ్ముక్ జస్వంత్, అతని అన్న సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Big Boss Shanmukh Arrest: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో దొరికిపోయాడు.తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: