Operation Valentine Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శక్తికాంత్ దర్శకత్వం వహించారు. సందీప్ ముద్ద సోనీ పిక్చర్స్ బ్యానర్ (Sony Pictures) పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గుపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 3 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, దేశభక్తి డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ లో కనిపించింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.
పూర్తిగా చదవండి..Operation Valentine Trailer: “ఏం జరిగిన చూస్కుందాం” .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Translate this News: