Janhvi Kapoor in RC16: RRR తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే గతంలో ఈ డైరెక్టర్ మొదలు పెట్టిన ‘భారతీయుడు 2’ చిత్రం మళ్ళీ పట్టాలెక్కడంతో.. గేమ్ చేంజర్ (Game Changer) ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ను ఒకే చేశారు.
పూర్తిగా చదవండి..Ram Charan RC16: జూనియర్ అతిలోక సుందరితో.. జతకట్టనున్న మెగా పవర్ స్టార్
డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో RC16 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతుంది. RC16 లో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: