Marriage Season: మన దేశంలో పెళ్లి అంటే మామూలుగా ఉండదు. పెద్ద ఉత్సవంలా ఉంటుంది. ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి చేయాలంటే.. స్థోమతకు మించి ఖర్చు చేయడం చాలా సహజం. దానికి చాలా కారణాలున్నాయి. మన దేశంలో వివాహానికి చేసే ఖర్చు మరేదేశంలోనూ చేయరు అంటే అతిశయోక్తి కాదు. మాఘమాసం వచ్చేసింది. దీంతో పాటే పెళ్లిళ్లకు ముహూర్తాలు వచ్చేశాయి. ఇప్పటి నుంచి దాదాపుగా జూలై నెలవరకూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్‌పై ఉత్సాహంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Marriage Season: లక్షలాది వివాహాలు..లక్షల కోట్ల వ్యాపారం.. పీక్స్ లో పెళ్లిళ్ల సీజన్ అంచనాలు
మాఘ మాసం వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 45 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కవేస్తోంది.
Translate this News: