The Kerala Story OTT Release: సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో ఆదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన హిందీ డ్రామా ఫిలిం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది మే 5న విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటు సినిమా, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మత పరమైన అంశాలతో కూడిన ఈ సినిమా .. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివాదాస్పదంగా మారింది. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా ఈ సినిమానే బ్యాన్ చేశాయి. ఇక గతేడాది హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి రిలీజైన తొమ్మిది నెలల తరువాత ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
పూర్తిగా చదవండి..The Kerala Story: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నటి ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం మొత్తానికి 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
Translate this News: