BRS Balka Suman: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని పరుషపదజాలాన్ని ఉపయోగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేసామన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Balka Suman: కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని ఉద్వేగపూరితంగా చెప్పు తీసి చూపెట్టారు. సీఎం రేవంత్ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Translate this News: