AP Cabinet To Discuss Free Bus : ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సౌకర్యంపై ఇవాళ జరగనున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి ఈ సమావేశంలో ఆమోదం లభించే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కర్నాటక(Karnataka), తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వాలు(Congress Government) అమలు చేస్తున్న ఈ పథకం అమలుకు ప్రభుత్వం చేసే వార్షిక వ్యయంపై ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
పూర్తిగా చదవండి..Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్ భేటీ!
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.
Translate this News: