Lavanya Drugs Case: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపింది. ఇప్పటికే మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ తదితర వాడకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా వరుస సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో (Tollywood Young Hero) ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగ్ (Narsingi) లో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా సంగీతం టీచర్‌గా పనిచేస్తున్న ఆ యువతి నుంచి మాదాపూర్ SOT పోలీసులు 4 గ్రాముల MDM స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయపడ్డాయి.
పూర్తిగా చదవండి..Lavanya: సంగీతం టీచర్ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు
టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగిలో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమెను కృష్ణా జిల్లాకు చెందిన మన్నెపల్లి లావణ్యగా గుర్తించారు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సంగీతం టీచర్ గా పనిచేస్తూనే జల్సాల కోసం ఈ గలీజ్ దందాలో దిగింది.
Translate this News: