America vs Iran : అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) యుద్ధం చెలరేగినప్పటి నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికన్(American) దళాలపై ఇరాక్, సిరియా, జోర్డాన్, యెమెన్ దేశాల్లో ఇరాన్ మద్దతు దళాలు 150 కంటే ఎక్కువ సార్లు దాడి చేశాయి. ఇక తాజాగా జోర్డాన్(Jordan) లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఆదివారం దాడి చేసి ముగ్గురు సైనికులను హతమార్చింది. 40 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిలో మరణించిన అతి పిన్న వయస్కుడైన సైనికుడి వయస్సు 23. టవర్-22 బేస్ వద్ద ఉన్న దాదాపు 350 మంది సైనికులు డ్రోన్‌ను ఎందుకు ఆపలేకపోయారో తెలుసుకోవడానికి అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరాన్ చర్యపై అమెరికా రగిలిపోతున్నారని సమాచారం. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) పై ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..America Iran War : కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి!
ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.
Translate this News: