Naga Babu vs TDP : జనసేన-టీడీపీ(Janasena-TDP) పొత్తులో లుకలుకలు మొదలైనట్టే కనిపిస్తోంది. చంద్రబాబు(Chandrababu) రెండు సీట్లు ప్రకటిస్తే తాను కూడా రెండు ప్రకటిస్తానంటూ ఏకంగా ప్రకటించిపడేశారు పవన్(Pawan Kalyan). రాజోలు(Razole), రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేయడంతో టీడీపీ గుండెల్లో బాంబు పేలింది. పవన్ ఎక్కడా తగ్గేదేలా అని దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. పొత్తులో ఎవరూ అప్పర్ హ్యాండ్ కాదని పవన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
పొత్తు ధర్మం పాటించాలంటూ చంద్రబాబుపై నేరుగా వ్యాఖ్యలు చేశారు పవన్. ఇదే సమయంలో నాగబాబు(Naga Babu) చేసిన ట్వీట్లు ఆసక్తిని రేపుతున్నాయి.
Naga Babu : న్యూటన్ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు!
ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్లు వైరల్గా మారాయి. చర్యకి, ప్రతి చర్య ఉంటుందని నాగబాబు పోస్ట్ చేశారు. న్యూటన్స్ లాస్ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు.
Translate this News: