Gold Rate News: బంగారం.. కొద్దీ రోజులుగా తగ్గుతూ ఊరట నిచ్చినట్టే ఇచ్చిన బంగారం మళ్ళీ పెరిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారిలో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. మూడు రోజులుగా తగ్గుదల బాటలోనే ఉన్న బంగారం ధరలు ఈరోజు అంటే జనవరి 20న పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరల(Gold Rate News)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 20న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు(Today Gold Price) పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే శనివారం (జనవరి 20) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate News: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే..
మూడురోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.200లు పెరిగి రూ.77,200 వద్ద ఉంది.
Translate this News: