Supreme Court Verdict on Chandrababu Naidu’s plea in Skill Development case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తనపై ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(CID) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ(జనవరి 16) తీర్పు వెలువరించనుంది. గతేడాది(2023) అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు తీర్పును వెలువరించనుంది.
స్కిల్ స్కామ్ కేసులో కీ పాయింట్స్, టైమ్‌లైన్:
Skill Scam TimeLine: స్కిల్ స్కామ్ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్ ఇదిగో!
స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: