Supreme Court To Pronounce Judgment Today On Chandrababu Naidu’s Plea To Quash FIR In Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ(జనవరి 16)తీర్పును వెలువరించనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, ఎమ్ త్రివేది జనవరి 16న మధ్యాహ్నం 1 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023 సెప్టెంబర్ 22 నాటి ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పును వెలువరించనున్నారు. 371 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత, టీడీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ఈ కేసును రాజకీయ ప్రతీకారంగా భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..!
స్కిల్ స్కామ్ కేసులో ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు.
Translate this News: