Stock Market News: కష్టపడి డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే.. దానిని జాగ్రత్తగా ఖర్చు చేసి కొంత మొత్తం పొదుపు చేయడం మరో ఎత్తు. పొదుపు చేసిన డబ్బును జాగ్రత్తగా మదుపు చేయడం చాలా కష్టమైనా పని. పెట్టుబడి పెట్టినపుడు రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకునైనా సరే.. డబ్బును సంపాదించాలి అనుకునే వారు స్టాక్ మార్కెట్ వైపు చూస్తారు. అయితే, స్టాక్ మార్కెట్ అనేది పూర్తి అస్థిరత తో ఉండే ప్రదేశం. ఒక్క నిమిషంలో మన డబ్బు డబుల్ అయిపోవచ్చు.. మరో నిమిషంలోనే ఒక్క రూపాయి మిగలకుండా ఊడ్చుకుపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.. జాగ్రత్తగా ఆచి తూచి.. నిపుణుల సలహాలు తీసుకుని.. కొంత రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Stock Market News) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV.
పూర్తిగా చదవండి..Stock Market News: అమ్మకాల ఒత్తిడి.. స్టాక్ మార్కెట్ క్రాష్.. ఎందుకంటే..
ఈరోజు అంటే మంగళవారం (జనవరి 9) స్టాక్ మార్కెట్ బుల్లిష్ పెరుగుదలను చూస్తోంది. సెన్సెక్స్ 415 పాయింట్ల లాభంతో 71,770 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నిఫ్టీలో 140 పాయింట్ల పెరుగుదల ఉంది, ఇది 21,653 స్థాయి వద్ద ప్రారంభమైంది.
Translate this News: