Deepika Padukone:బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణె నేడు 38వ పడిలోకి అడుగుపెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటీ అనతికాలంలోనే మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్టు, లిమ్కా ప్రకటనల్లో నటించిన జనాలకు పరిచయమైన బ్యూటీ ఈ క్రమంలోనే మోడలిగ్ నుంచి సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. మొదట బాలీవుడ్ హీరో హిమేష్ రేష్మియా ‘ఆప్ కా సురూర్'(Aap Kaa Surroor) అల్బమ్ లోని ‘నాం హై తేరా’ అనే మ్యూజిక్ వీడియోతో కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత వెంటనే 2006లో ఉపేంద్ర హీరోగా వచ్చిన కన్నడ సినిమా ‘ఐశ్వర్య’తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఆమె.. 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఓం శాంతి ఓం'((Om Shanti Om)తో భారీ పాపులారిటీ దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోణె నేడు తన 38వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దీపికకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరిన్ని సినిమాలతో అలరించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నారు.
Translate this News: