Stock Market Record: మన డబ్బును మరింత పెంచాలంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఈ కారణంతోనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అయితే, స్టాక్ మార్కెట్ అనేది పూర్తి అస్థిరత తో ఉండే ప్రదేశం. ఒక్క నిమిషంలో మన డబ్బు డబుల్ అయిపోవచ్చు.. మరో నిమిషంలోనే ఒక్క రూపాయి మిగలకుండా ఊడ్చుకుపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.. జాగ్రత్తగా ఆచి తూచి.. నిపుణుల సలహాలు తీసుకుని.. కొంత రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది. అందుకే, ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Stock Market Record) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అందుకే అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే గురువారం నాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం.
పూర్తిగా చదవండి..Stock Market Record: స్టాక్ మార్కెట్ జోరు.. ఇది దూకుడు కాదు అంతకు మించి..
నిన్న (డిసెంబర్ 28) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగింది. 72,410 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 21,777 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా 6 మాత్రమే పతనమయ్యాయి.
Translate this News: