Gold Rate Today : ఈ బుధవారం నుంచి పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఈ పెరుగుదలతో మరింత పైకి చేరుకున్నాయి. బంగారం ధరల పరుగులు ఎప్పుడు ఆగుతాయో అని బంగారం కొనాలని అనుకునే వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం 65వేళా దగ్గరకు చేరుకొని రికార్డ్ సృష్టిస్తోంది. ఈరోజు అంటే డిసెంబర్ 29న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో దేశీయంగాను బంగారం ధరలు(Gold Rates) పైకెగశాయి. మరోవైపు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో పెరిగాయి. ఈరోజు అంటే శుక్రవారం (డిసెంబర్ 29) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rates : బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే..
బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 400 పెరిగి రూ.58,900ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 పెరిగి రూ.64,250లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర కూడా కేజీకి 300 పెరిగి రూ.81,100ల వద్దకు చేరుకుంది.
Translate this News: