Demat Nominee: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డీమ్యాట్ ఖాతా – మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు (Mutual Funds) నామినీని యాడ్ చేయడానికి చివరి తేదీని 6 నెలలు పొడిగించింది. ఇంతకుముందు ఈ గడువు 31 డిసెంబర్ 2023 వరకు ఉంది. సెబీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు డీమ్యాట్ ఎకౌంట్ హోల్డర్స్ జూన్ 30, 2024 వరకు నామినీని(Nominee) యాడ్ చేయవచ్చు. ఇది కాకుండా, మార్కెట్ రెగ్యులేటర్ ఫిజికల్ సెక్యూరిటీ హోల్డర్లను పాన్, నామినేషన్, KYC వివరాలను అప్డేట్ చేయమని కోరింది. రిజిస్ట్రార్ – ట్రాన్స్ఫర్ ఏజెంట్ (RTA) డేటా ప్రకారం, సెప్టెంబర్ 2023 చివరి నాటికి దాదాపు 25 లక్షల మంది పాన్ హోల్డర్లు తమ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలలో ఎన్రోల్మెంట్ను అప్డేట్ చేయలేదు.
పూర్తిగా చదవండి..Nominee: డీ మ్యాట్ ఎకౌంట్ ఉందా? అందుకోసం గడువు పెరిగింది.. తెలుసా?
డీ మ్యాట్ ఎకౌంట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం నామినీని యాడ్ చేసుకోవడానికి మరోసారి గడువు పెంచింది సెబీ. ఇంతకు ముందు ఈ గడువు డిసెంబర్ 31తో పూర్తి అవుతోంది. అయితే, ఇప్పుడు దీనిని జూన్ 30, 2024వరకూ పెంచుతూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది.
Translate this News: