భాష(Language)ను కాపాడుకోవడం ముఖ్యమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే భాషపై ప్రేమ పేరిట అమాయకులపై దాడులు చేయడం… ఆస్తులను ధ్వంసం చేయడం నేరం అవుతుంది. భాషను అమితంగా ప్రేమంచే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు(Tamilnadu), కర్ణాటక(Karnataka)లో గతంలో చాలా సార్లు భాష కోసం ఆందోళనలు జరిగాయి. అటు ఈ రెండు రాష్ట్రాలకు చెందని చిత్ర పరిశ్రమ సైతం తెలుగు భాషకు సంబంధించిన సినిమాల విషయంలో ఫైటింగ్లకు దిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బృహత్ బెంగళూరు(Bagalore) మహానగర పాలికే (బీబీఎంపీ) తీసుకున్న ఓ నిర్ణయంతో అక్కడ మరోసారి లాంగ్వేజ్ వార్ మొదలైంది.
పూర్తిగా చదవండి..Kannada vs English: ఇంగ్లీష్ నేమ్బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్ వార్!
బెంగళూరులోని అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాల నేమ్ బోర్డులపై తప్పనిసరిగా 60శాతం కన్నడను ఉపయోగించాలని బీబీఎంపీ ఆదేశించింది. అందుకు ఫిబ్రవరి 28వరకు టైమ్ ఇవ్వగా.. కన్నడ కార్యకర్తల మాత్రం ఇవాళే రచ్చచేశారు. ఇంగ్లీష్ సైన్ బోర్డులను చింపివేశారు.
Translate this News: