Bubblegum Song: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి చిత్రం ‘బబుల్ గమ్’. ఈ సినిమాకు రవికాంత్ దర్శకత్వం వహించారు. రవికాంత్ ‘క్షణం’ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. మొదటి సినిమాకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు పొందారు. ప్రస్తుతం ‘బబుల్ గమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘బబుల్ గమ్’ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 28న థియేటర్స్ లో విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Bubblegum Song: రోషన్ కనకాల బబుల్ గమ్..’ఈజీ పీజీ’ లిరికల్ సాంగ్ వీడియో
రవికాంత్ పెరుపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'బబుల్ గమ్'. ఈ సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా నుంచి 'జస్ట్ ఈజీ పీజీ' సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
Translate this News: