Hindi v/s Non-Hindi War : హిందీ వర్సెస్ నాన్-హిందీ గొడవలు ఈనాటివి కావు. దశాబ్దాలుగా ఈ ఉత్తరాది భాషను రుద్దేవారిపై దక్షిణాది రాష్ట్రాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందీ రుద్దుడుకు వ్యతిరేకంగా గళం విప్పే రాష్ట్రం తమిళనాడు. హిందీ వ్యతిరేక ఉద్యమాలకు సెంటర్ ఆఫ్ ల్యాండ్ తహిళనాడే. పెరియర్ నుంచి ఇప్పటి సీఎం స్టాలిన్ వరకు అందరూ హిందీ ఇంపోజ్కు వ్యతిరేకంగా పోరాడిన వారే. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు హిందీ రుద్డుడుపై అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శలు గుప్పిస్తుంటాయి. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాడమే లక్ష్యంగా ‘INDIA‘ కూటమి పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ(BJP) ని వ్యతిరేకించే పార్టీలన్ని ఉన్నాయి. ఇందులో దక్షిణాది పార్టీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఎందుకటే బీజేపీకి దక్షిణాదిన ప్రస్తుతం ఒక రాష్ట్రం కూడా లేదు. సహజంగా హిందీ భాష రుద్దుడుపై వ్యతిరేకంగా ఉండే తమిళ పార్టీలు INDIA కూటమీలో భాగంగా నార్త్ పార్టీలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగో సారి ఈ కూటమి భేటీ అవ్వగా..ఈ మీటింగ్‌లో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నోరుపారేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Nitish Vs DMK : ‘హిందీ నేర్చుకోవాల్సిందే..’ ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు!
దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు.
Translate this News: