Kesineni Nani’s comments: విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని.. బుద్దా వెంకన్నపై మరొసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బీసీ నేతకు అవకాశం ఇవ్వాలన్న చర్చపై కేశినేని నాని మాట్లాడుతూ.. నీతి నిజాయతీతో పనిచేసే వారికి సీటు ఇస్తేనే తన మద్దతు తెలుపుతారన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు, భూకబ్జాలు చేసే వారికి సపోర్ట్ చేయనిన అన్నారు. అలాంటి బీసీలు పార్టీకి అవసరం లేదన్నారు. టిడిపికి అండగా ఉండే బీసీలే అవసరమన్నారు. విజయవాడ ఎంపీగా.. క్యారెక్టర్ ఉన్న నిరుపేద బీసీలకు అవకాశం ఇస్తే కాళ్ళకు దండం పెట్టి మద్దతు తెలుపుతాను కానీ, అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు.
పూర్తిగా చదవండి..TDP: ‘అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వను’.. కేసినేని నాని కీలక వ్యాఖ్యలు.!
మరోసారి బుద్దా వెంకన్నపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసినేని నాని. కాల్ మనీ సెక్స్ రాకెట్లు, భూకబ్జాలు, అడ్డగోలుగా దోచుకునే బీసీలకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. విజయవాడ ఎంపీగా నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తికి అవకాశం ఇస్తేనే సపోర్ట్ చేస్తానన్నారు.
Translate this News: