పార్లమెంట్(Parliament)పై దాడి చేయడమంటే చిన్నావిషయం కాదు. యావత్ దేశంపై దాడి చేసినట్టే. ఎంపీలను ఎన్నికున్నది ప్రజలే.. దేశానికి ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలే. అంటే అసెంబ్లీపై దాడి చేస్తే సంబంధిత రాష్ట్రంపై దాడి చేసినట్టే.. ఇక పార్లమెంట్‌పై దాడి అంటే దేశంపై దాడిగానే అభివర్ణిస్తుంటారు. పట్టబడ్డ వారు ఏ కారణంతో ఈ దాడికి పాల్పడ్డారో స్పష్టమైన క్లారిటీ లేదు కానీ.. ప్రభుత్వంపై నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. చట్టప్రకారం నిరసనలు చేసుకునే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుంది. అయితే పార్లమెంట్‌పై తాజాగా జరిగిన దాడులు చట్ట వ్యతిరేకమే. అందుకే ఈ దాడికి పాల్పడ్డవారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Attack On Parliament: పార్లమెంట్‌పై దాడి చేసిన వారి బతుకులు జైల్లోనే.. ‘ఊపా’తో పాటు మొత్తం పెట్టిన సెక్షన్ల లిస్ట్ ఇదే!
పార్లమెంట్‌పై దాడి చేసిన వారి జీవితాలు ఇక జైల్లోనేనని అర్థమవుతోంది. వారిపై పెట్టిన సెక్షన్లు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. UAPA సెక్షన్ 16, 18తో పాటు ఐపీసీ సెక్షన్లు 120బి, 452, 153,186, 353 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Translate this News: