IT Minister Sridhar Babu: ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగిన టాపిక్స్‌లో నెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరన్నది ఒకటి. ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపించినా మొదటి నుంచి అంతా దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేటీఆర్ స్థానాన్ని ఆయన రీప్లేస్ చేస్తేనే బాగుంటదన్న కామెంట్స్ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించింది. చివరికి అందరూ ఊహించిందే జరిగింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే:
దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ.. రేవంత్ కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. మంథని..రాష్ట్రంలోనే అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటి. ఎందుకంటే మహామహులు ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. మంథని రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన పీవీ నరసింహరావును మంథనిలో నాలుగు సార్లు గెలిచి చరిత్ర సృష్టించగా… ఆ తర్వాత అదే స్థాయిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయకేతనం ఎగరవేశారు. 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ గెలవగా, 2018 ఎన్నికల్లో శ్రీధర్‌బాబు గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి శ్రీదర్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
IT Minister Sridhar Babu: లాయర్ టు ఐటీ మినిస్టర్.. క్రికెట్ ప్లేయర్.. శ్రీధర్‌బాబు ఆల్‌రౌండర్ బాసూ!
దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించిన శ్రీధర్‌బాబు లాయర్‌గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా, విద్యార్థి దశలో క్రికెటర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
Translate this News: