Ravi Teja Movies: కొన్నేళ్ల క్రితం ప్రజలకి వినోదం అంటే సినిమా ఒక్కటే.. టీవీలు వచ్చిన తరువాత కొంత మార్పు వచ్చింది. కానీ.. ఇప్పుడు ఓటీటీ వ్యవస్థ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. మరింత వినోదం ఇంటి హాలులోకి వచ్చి కూచుంది. వినోదం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. అభిమాన హీరోని చూడాలంటే, ఒక బటన్ నొక్కితే చాలు నట్టింట ప్రత్యక్షం అయిపోతున్నాడు. దీంతో సహజంగానే థియేటర్లకు సినిమా కోసం వెళ్లే జనం తగ్గిపోతున్నారనేది వాస్తవం. ఒక సినిమా విడుదల అయితే, ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, బావుంది అంటేనే థియేటర్ కి వెళుతున్న పరిస్థితి ఉంది. సినిమా టాక్ బావుంటేనే పెద్ద తెర.. లేకపోతె ఎలానూ ఇంట్లోని బుల్లితెర మీదకు వస్తుందిగా చూడొచ్చు అని లైట్ తీసుకుంటున్నారు. ఓటీటీ ప్రభావం చాలా గట్టిగానే సినిమాలపై పడుతోంది. కంటెంట్ ఉంటె తప్ప సినిమా నిలబడలేని పరిస్థితి. దానికి తోడు నిర్మాతలు కూడా సినిమా విడుదలతో పాటే ఓటీటీ రైట్స్ కూడా అమ్మేసుకుంటున్నారు. దీంతో సినిమా హిట్ అయితే 50 రోజుల తర్వాత.. కాకపోతే రెండు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతోంది. ఇదీ ఇప్పుడు పరిస్థితి. ఇదంతా ఎందుకంటే, టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చాలామంది హీరోల సినిమాలు ఆగిపోయాయని. ఎందుకంటే, నిర్మాతలు ఓటీటీ దెబ్బకు సినిమా ఖర్చులు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారట. అందుకే అందరూ ఆ పనిలో పడ్డారని టాక్.
పూర్తిగా చదవండి..Ravi Teja Movies: రవితేజకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తగిలిందట.. ఆ సినిమాలు ఆగిపోయాయా?
ఓటీటీతో నట్టింటిలో సినిమాల సందడి మొదలైంది. దీంతో సినిమాల కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు హీరోలపై పడుతోందని అనుకుంటున్నారు. రవితేజతో ఎనౌన్స్ అయిన రెండు సినిమాలు నిర్మాతలు డ్రాప్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Translate this News: