Virat Kohli: విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా అతను ప్రపంచంలోని ఏ జట్టులోనైనా స్థానం సంపాదించగలంత ఫిట్ గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ పై వస్తున్న వార్తలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup) విరాట్ కోహ్లీ ఆడే అవకాశం లేదని అంటున్నారు. అతనికి జట్టులో చోటు లభించకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్ 30న జరిగిన బిసిసిఐ సెలక్టర్ల సమావేశంలో కూడా దీనిపై చర్చించారని, ఇందులో రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ టీ20ల్లో (T20) విరాట్ కోహ్లీ భవితవ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Virat Kohli: టీ20 వరల్డ్ కప్ టీమ్ లో కోహ్లీకి ఛాన్స్ లేదా? ఏమి జరుగుతోంది?
వచ్చే సంవత్సరం జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం లేదని చెబుతున్నారు. కోహ్లీకి టీమ్ లో చోటు లభించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టూర్ లో టీ20, వన్డే సిరీస్ లకు కోహ్లీ స్వచ్చందంగా తప్పుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Translate this News: