IPL AUCTION 2024: ఐపీఎల్లో ప్లేయర్ల రిటెన్షన్‌కి రేపే(నవంబర్ 26) లాస్ట్ డేట్. దీంతో సోషల్‌మీడియాలో పలు రకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ గుజరాత్‌కి వెళ్తాడని.. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తిరిగి ముంబైకి వస్తాడని పలు న్యూస్ వెబ్‌సైట్స్ పలు కథనాలు ప్రచురించాయి. అయితే ప్రముఖ క్రికెట్ సైట్ ‘ESPN CricInfo’ కూడా ఈ ట్రేడ్‌పై ఓ ఆర్టికల్‌ని పబ్లిష్ చేసింది. రూ.15కోట్ల క్యాష్ ట్రేడింగ్‌తో పాండ్యాను ముంబై కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని ప్రచురించింది. అయితే గుజరాత్‌కు రోహిత్ వెళ్తున్నాడన్న వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రోహిత్ గుజరాత్‌కు వెళ్తున్నాడన్న వార్త పుకారే కావొచ్చు. ఇదే సమయంలో మరో వార్త తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Rohit Sharma: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్…!
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకవేళ రోహిత్ శర్మను వదులుకుంటే బిడ్డింగ్ వేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందన్న 'thecricketlounge' వెబ్సైట్ ఆర్టికల్ వైరల్‌గా మారింది. అయితే రోహిత్‌ను ముంబై వదులుకోదని కుండబద్దలు కొడుతున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్!
Translate this News: