Raashi khanna: టాలీవుడ్ ప్రముఖ నటి రాశీ కన్నా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాశీ కన్నా అవసరాల శ్రీనివాస్ తొలి సారి దర్శకత్వం వహించిన ఊహలు గుస గుస లాడే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ చిత్రంలో రాశీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాశీ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్ఠీఆర్, రవితేజ, విజయ్ దేవర కొండ, రామ్ పలు స్టార్ హీరోల సరసన నటించింది. రాశీ నటించిన జై లవకుశ, సుప్రీం, ప్రతిరోజు పండగ, తొలి ప్రేమ తన కెరియర్ లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ.. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
పూర్తిగా చదవండి..Raashi khanna: ఎంత ముద్దుగా ఉందో.. మేకప్ లేని రాశిఖన్నాను చూస్తే ఫ్లాట్ అవుతారు
ప్రముఖ తెలుగు హీరోయిన్ రాశీఖన్నా తాజాగా సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఫేస్ గ్లోగా, అందంగా కనిపించడానికి ఇంట్లోనే పాటించే అద్భుతమైన చిట్కాను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Translate this News: