పొద్దున లేస్తే పదిమందిని వెంటేసుకుని గడప దాటితే కారులోనే అడుగుపెట్టే నాయకులను చాలా మందినే చూస్తుంటాం. చోటామోటా లీడర్ల నుంచి మంత్రుల వరకూ కారును స్టేటస్ సింబల్లా భావిస్తున్న ఈ రోజుల్లో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు సొంతంగా ఒక్క కారు కూడా లేదని చెప్తుండడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. మంత్రులు సహా పలు పార్టీల కీలక నేతల ఎన్నికల అఫిడవిట్లూ ఇలానే ఉన్నాయి. నిజంగా వాళ్లకసలు కార్లే లేవా? కోట్ల ఆస్తులున్నా ఒక్క కారు కూడా ఎందుకు కొనుక్కోలేదు? మరి వాళ్ల ఇళ్ల ఎదుట ఉన్న విలాసవంతమైన కార్లన్నీ ఎవరివి?… సాధారణ ప్రజల్లో ఇలాంటి సందేహాలు రావడం సహజం. అసలు వారికి సొంత కార్లెందుకు లేవంటే…
ఇది కూడా చదవండి: నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్ తో సహా ఆ ప్రముఖ లీడర్లకు కార్లే లేవు.. ఈ సంగతి వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా?
ఇటీవల నామినేషన్లసమయంలో కేసీఆర్ తో సహా అనేక లీడర్లకు కార్లు లేవని విని జనం ఆశ్చర్యపోయారు. ఇన్ కం ట్యాక్స్ చిక్కులు, ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే తీరిక లేకపోవడం, న్యూమరాలజీ నమ్మకాల వంటి కారణాలతో లీడర్లు సాధారణంగా తమ పేరుమీద కార్లు కొనేందుకు ఆసక్తి చూపరు.
Translate this News: