Alekhya Harika: ‘దేత్తడి హారిక’ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈ తెలుగు అమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘దేత్తడి హారిక ‘ యు ట్యూబ్ ఛానెల్ లో కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హారిక సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా.. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఆ తర్వాత హారిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. బిగ్ బాస్ లో టాప్ 5 గా నిలిచి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఈ బిగ్ బాస్ బ్యూటీ ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘వరుడు కావలెను’ ఇలా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది హారిక. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న హారిక.. ప్రస్తుతం సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.
పూర్తిగా చదవండి..Alekhya Harika: హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక
హీరోయిన్ గా లాంచ్ అవుతున్న బిగ్ బాస్ ఫెమ్ అలేఖ్య హారిక. 'బేబీ' మూవీ మేకర్స్ నిర్మాణంలో హీరో సంతోష్ శోభన్ సరసన నటించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడంతో పాటు గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగ చైతన్య హాజరై క్లాప్ కొట్టి తమ బెస్ట్ విషెస్ అందజేశారు.
Translate this News: