వారంలో ఒక్కో రోజును ఒక్కో దేవుడికి అంకితం చేశారు హిందువులు. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయస్వామికి, బుధవారం గణపతికి, అయ్యప్పస్వామికి.. గురువారం, దత్తాత్రేయుడు, సాయిబాబాకి.. శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు భక్తులు. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని పూజిస్తారు. ప్రతీ శనివారం భక్తులు చాలామంది వెంకటేశ్వర ఆలయాలకు వెళ్తారు. అక్కడ ప్రదక్షణలు చేస్తే సకల దోషాలు పోతాయని వారి నమ్మకం. ఇక శనివారం వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. అవేంటో చూడండి.
పూర్తిగా చదవండి..Lord Venkateswara: ‘శని’కి చెక్ పెట్టే దేవుడు.. వెంకటేశ్వరుడు..! శనివారం ఎందుకు పూజించాలో తెలుసుకోండి!
శనివారం వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా పూజించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. శనిదేవుడు మనపై చూపే చెడు ప్రభావల నుంచి విముక్తి చేసే శక్తి వెంకటేశ్వరుడికి ఉందని భక్తుల నమ్మకం. శనివారం బాలాజీని పూజిస్తే అదృష్టం, సంపద, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అందుకే ఆయన ఆశీర్వాదం కోసం భక్తులు శనివారం వెంకటేశ్వరుడి ఆలయాలను సందర్శిస్తారు.
Translate this News: