కొణెదల వారి ఇంట మరో ఐదు రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది జూన్ లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి వేడుక ఎప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..మెగా వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు. కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను కూడా కార్టులో ప్రింట్ చేశారు. నవంబర్ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్ చెప్పేశారు.
Translate this News: