‘బాల్ ఎలా వస్తే నాకేంటి.. నాకు నచ్చిన సైడ్ బౌండరీ బాదుతాను.. నువ్వు ఇన్‌స్వింగర్ వేసుకో.. అవుట్ స్వింగర్ వేసుకో.. నేను మాత్రం మైండ్‌లో సిక్స్ కొట్టాలని డిసైడ్ అయితే బ్లైండ్‌గా బౌండరీ బయట బాల్ పడాల్సిందే. గుర్తుపెట్టుకో.. నా పేరు మ్యాక్స్‌వెల్..!’ ఇది బాలయ్య బాబు సినిమా డైలాగ్ కాదు కానీ.. సినిమాలకు సెట్ అయ్యే డైలాగ్. నెదర్లాండ్స్‌పై రికార్డు సెంచరీ చేసిన ఈ ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుంచి దిగ్గజాల వరకు మ్యాక్సీ(Maxwell) ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మ్యాక్సీ షాట్లకు ఫిదా ఐపోయారంతా. అందులో ఆ రివర్స్ స్వీప్ సిక్స్ అయితే మాములుగా లేదు.. లూప్‌లో పెట్టుకోని చూసే సిక్స్ అది. నిన్నటి నుంచి ఆ షాట్‌ను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదన్న డైలాగ్ అభిమానుల నోట నుంచి వినిపిస్తోంది. అటు దిగ్గజాలు సైతం ఎవరి స్టైల్లో వారు స్పందిస్తుండగా.. తాజాగా క్రికెట్ లెజెండ్, టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మ్యాక్సీని ఆకాశానికి ఎత్తేశాడు.
పూర్తిగా చదవండి..Maxwell: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. ‘నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను’!
వరల్డ్‌కప్‌లో తనకు ఒక్క పరుగు చేయడానికి ఓ మ్యాచ్‌లో 40 బంతులు ఆడాల్సి వచ్చిందని.. అదే మ్యాక్స్‌వెల్ అన్నే బంతుల్లో సెంచరీ చేశాడంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు సునీల్ గవాస్కర్. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌తో అతను ఆడిన రివర్స్ స్వీప్ సిక్సర్‌కు 6 పరుగులు ఇస్తే సరిపోదని.. 12 రన్స్ ఇవ్వాలంటూ తనదైన స్టైల్లో కామెంట్స్ చేశారు సన్ని.
Translate this News: