చిత్తూరు జిల్లా కుప్పంలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. పట్టణంలోని ఫిషర్స్ కాలనీ సమీపంలో ప్రవీణ్ ఇంట్లో బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చెడ్డి గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు దొంగతనానికి ప్రయత్నం చేయగా.. ఇంటి యజమాని అప్రమత్తమయ్యారు. ప్రవీణ్ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ఓ దొంగను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగలు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..AP Cheddi Gang: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు
కుప్పంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కుప్పం పట్టణం ఫిషర్స్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగతనానికి యత్నించగా ఇంటి యజమాని అప్రమత్తం అయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో ఓ దొంగను చుట్టుపక్కల వారు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు.
Translate this News: