Bhagavanth Kesari Review: బాలయ్య (Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ఒక కీలక పాత్రలో నటించగా, కాజల్ (Kajal) హీరోయిన్ గా నటించారు. బాలయ్య నటించిన గత సినిమాల కంటే ఈ సినిమాలో బాలయ్య పాత్ర కాస్త బిన్నంగా ఉండబోతుందని మూవీ టీం మొదటి నుంచి చెప్పుకొచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సినిమాలో బాలయ్య పాత్రను ఎలా చూపించారు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో మొదలైంది.
ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పై బాగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. ఇక సినిమా పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు ట్విట్టర్ (Twitter) ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు సినిమా సూపర్ హిట్ అనగా, మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..