Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల వాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రముఖ సినీ జర్నలిస్ట్ భరద్వాజ స్పందించారు. ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని పురస్కారం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారని అన్నారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకుంటున్న సమయంలో అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో చాలా ఆనందంగా కనిపించారన్నారు. ఇది అల్లు అర్జున్ జీవితంలో ఒక మరిచిపోలేని ఘటనగా అభివర్ణించారు భరద్వాజ.
పూర్తిగా చదవండి..Allu Arjun: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పై జర్నలిస్ట్ భరద్వాజ షాకింగ్ కామెంట్స్..?
అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం రావడంపై సినీ అభిమానులు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయనకు మించిన నటులు లేరా? అన్న ప్రశ్న కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాఖ్యానాలు సరికాదని ప్రముఖ సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అన్నారు.
Translate this News: