కళ్లు(Eyes) చాలా సెన్సిటివ్.. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్లతోనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. కంటి ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్‌తో కళ్ల సమస్యలు బాగా పెరుగుతున్నాయి. చిన్నతనంలోలే చాలా మందికి విజన్ ప్రాబ్లెమ్ వచ్చి స్పెట్స్ పెట్టుకోవాల్సి వస్తోంది. ఇక కంప్యూటర్ల(Computers) ముందు ఎక్కువగా జాబ్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే పనిగా స్క్రీన్ ముందే గడపడం వల్ల అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. అందులో చాలా మందికి కళ్ల దురదతో పాటు నొప్పి కూడా పెడుతుంది. ఇలాంటి వాటికి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే కొన్ని చిట్కాలు మీ కంటి నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. అవేంటో చూడండి.
పూర్తిగా చదవండి..Eye Care: కళ్లు నొప్పి పెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాతో మీ పెయిన్ ఫసక్..!
కళ్లు అదే పనిగా నొప్పి పెడుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే తగినంత నిద్ర, స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంప్యూటర్ గ్లాసెస్ వాడడం, మంచినీళ్లు తాగుతూ హైడ్రెటెడ్‌గా ఉండడం, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నట్టు అయితే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకోవడం లాంటి టిప్స్‌తో పెయిన్ కాస్త తగ్గించుకోవచ్చు.
Translate this News: