SLS: అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రొడక్ట్స్ కొనే సమాజం మనది. యాడ్ బాగుంటే ఆ వస్తువుకు మంచి గిరాకీ వచ్చినట్టే లెక్క. చాలా మంది ఏది కొన్ని దాని వెనుక రాసి ఉన్న వాటి గురించి ఎక్కువగా చదవరు. కేవలం రేట్ మాత్రమే చూస్తారు. ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మనం టూత్ పేస్ట్(Tooth paste) కొంటాం. దానికి వెనుక ఆ పేస్ట్‌లో ఏం పదార్థాలు ఉన్నాయో రాసి ఉంటాయి. అవి ఎప్పుడైనా చదవి.. అసలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? కచ్చితంగా చేయండి. ఎందుకంటే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. మార్నింగ్ లేగగానే అందరూ బ్రష్(Brush) చేస్తారు. దీనికి పేస్ట్ ఉపయోగిస్తారు. పేస్ట్ వెనుక రాసి ఉన్నది మాత్రం చదవరు. మార్కెట్లో దొరికే చాలా పేస్ట్‌లలో ఉండే
సోడియం లారిల్ సల్ఫేట్ (SLS)తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు.
Tooth Paste: మీ టూత్ పేస్ట్ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది.. ఏలాగో తెలుసుకోండి!
టూత్ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) అనే పదార్థం అనేక నోటి సమస్యలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.దీని వల్ల డ్రై మౌత్, నోటి అల్సర్లు, క్యాన్సర్ పుండ్లు లాంటివి సంభవిస్తాయి.అందుకే SLS లేని పేస్టులు మంచివి.
Translate this News: