Actress Meena Fires On Bandaru Satyanarayana: మంత్రి రోజా (Minister Roja) పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలుపై స్పందించి చర్యలు తీసుకోవాలని మీనా డిమాండ్ చేశారు. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయని ద్వజమెత్తారు. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం అన్నారు. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు అన్నారు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా.. ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసు అన్నారు.
పూర్తిగా చదవండి..Actress Meena: ఆ హక్కు బండారుకు ఎవరిచ్చారు..? రోజాకు అండగా నటి మీనా సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీనటులు రోజాకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా బండారుపై కొంతమంది సినీ తారలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Translate this News: