Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Cricketer Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma) రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాము త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని..మీడియా వాళ్లు దయచేసి ఫోటోలు తీయవద్దని కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిక్వెస్ట్ చేసినట్లు టాక్. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను పంచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: