NTR Emotional Speech at SIIMA Awards 2023: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 (SIIMA Awards) అట్టహాసంగా జరుగుతోంది. సైమా సెలబ్రేషన్స్‌లో తెలుగు, కన్నడ తారలు ట్రెండీ దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ (RRR Movie) చిత్రానికి గాను ఈ ఏడాది ఉత్తమనటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల (Sree Leela) ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా..సీతారామం మూవీ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..NTR: నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!!
ఉత్తమ నటుడిగా సైమా అవార్డు గెలుచుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ సైమా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Translate this News: