ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ ఆమోదం, కౌన్సిల్ సమావేశాలపై సంతకం చేసే ఫారమ్‌లతో సహా 13 చోట్ల చంద్రబాబు నాయుడు చేతిరాత సంతకాలు ఉన్నాయని ఏపీ సీఐడీ చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం (APCID) చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు. టీడీపీ సభ్యుడు జె.వెంకటేశ్వరలును చార్టర్డ్ అకౌంటెంట్‌గా నియమించారని.. ఆయన నియామకాన్ని ధృవీకరించే సంతకం ఉందన్నారు. డిప్యూటీ సీఎం అపర్ణ నియామకంపై చంద్రబాబు సంతకం కూడా ఉందని చెప్పారు సంజయ్. కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లో కూడా చంద్రబాబు సంతకం చేశారని చెప్పుకొచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన ఘటనకు సంబంధించిన వివరాలను సంజయ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. కార్పొరేషన్ ఏర్పాటు అనేక నియంత్రణ విధానాలను విస్మరించినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిలో గంటా సుబ్బారావు అనే ప్రైవేట్ వ్యక్తికి మూడు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారని.. 241 కోట్ల రూపాయలను తక్కువ సమయంలో ప్రైవేట్ ఖాతాలకు బదిలీ చేశారన్నారు.
AP CID on Skill Scam: 13 సార్లు ఏపీ బడ్జెట్ డాక్స్‌పై చంద్రబాబు సంతకం చేశారు.. ఏపీ సీఐడీ సంచలన ప్రెస్‌మీట్!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ ఆమోదం, కౌన్సిల్ సమావేశాలపై సంతకం చేసే ఫారమ్‌లతో సహా 13 చోట్ల చంద్రబాబు నాయుడు చేతిరాత సంతకాలు ఉన్నాయని ఏపీ సీఐడీ చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం (APCID) చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు.
Translate this News: