లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్‌లో ఓ ఊపు ఊపిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన మొదటి హిందీ చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. అలా బాలీవుడ్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్‌కు పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. నయనతార టాలీవుడ్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు, ఆమె కొత్త ఆఫర్లను తిరస్కరించినట్లు కనిపిస్తోంది.
కాల్షీట్ల డిమాండ్:
ఇటీవల, టాలీవుడ్ నిర్మాతలు కొంతమంది నయనతారను కలిసే ప్రయత్నం చేశారు. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు. అయితే నయనతారకు తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి లేదని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె తెలుగు చిత్రనిర్మాతల నుంచి స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. జవాన్‌తో, ఆమెకు పాన్ ఇండియా వైడ్లో చాలా పేరు వచ్చింది, ఇప్పుడు నయనతార కాల్షీట్లకు డిమాండ్ పెరిగింది.
Nayanthara: ఈ హీరోయిన్ ఇక టాలీవుడ్‌కు దూరం.. కొత్త ఆఫర్లను తిరస్కరిస్తోన్న లేడీ సూపర్‌స్టార్!
దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్‌లో ఓ ఊపు ఊపిన నయనతార.. 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ అంటే మొదట్నుంచి చిన్నచూపే ఉన్న నయనతార ఇప్పుడు మన ఇండస్ట్రీతో కలిసి పని చేయడానికి అసలు ఆసక్తి చూపడంలేదు. జవాన్‌తో, ఆమెకు పాన్ ఇండియా వైడ్లో చాలా పేరు వచ్చింది, ఇప్పుడు నయనతార కాల్షీట్లకు డిమాండ్ పెరిగింది.
Translate this News: