Kushi Vijay Deverakonda midnight call: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ(Vijay Devarkonda) వీడియోకాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే ఏమైంది..? ఓకేనా అని అడిగింది సమంత. నిన్ను మిస్సవుతున్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు. నీ కోసం నాక్ నాక్ నాక్ జోక్ చెప్తానంటూ విజయ్ కామెడీ చేశాడు. అర్థరాత్రి 1:30 సమయంలో జోకులా అని సమంత(Samantha) రిప్లై ఇచ్చింది. ‘నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే.. నా అంజలి నువ్వే..గీతాంజలి నువ్వే’ అంటూ విజయ్ పాట పాడాడు.. వీడియో కాల్లో విజయ్ పాట విని సమంత మురిసిపోయింది. ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా?
అసలేంటి వీడియో?
ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరలవడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇది వీడియో కాల్ కాదని..అది రికార్డెడ్ వీడియో అని.. సమంత గ్లాసెస్ చూస్తే అది అర్థమవుతోందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు విజయ్ దేవరకొండ పాట బాగా పాడాడని అభిప్రాయపడ్డారు. ఇది సెప్టెంబర్ 1న విడుదలయ్యే ఖుషీ ప్రమోషన్లలో భాగమంటున్నారు. ప్రమోషన్స్‌లో విజయ్ కింగ్ అని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇక ఇటివలి ఖుషీ చిత్రంలో కథానాయికగా నటించిన సమంత రూత్ ప్రభు అమెరికా వెళ్లింది . ఆమె లాస్ ఏంజిల్స్‌లో విహారయాత్ర చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ట్రావెల్ డైరీలను అభిమానులకు షేర్ చేస్తోంది. అటు ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో ఆమెను చేర్చుకోవడానికి విజయ్ దేవరకొండ ఈ తెలివైన పని చేశాడు. సమంతకి వీడియో కాల్ చేసి ఆమె సిగ్గుపడేలా చేశాడు. నాక్-నాక్ జోక్ చెప్పి నవ్వించాడు. ఇదంతా సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కొత్త ప్రచార వ్యూహం:
Kushi: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో
విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషీ' సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయి. ఖుషి థియేట్రికల్ లాంచ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Translate this News: