IBPS Clerk Admit Card: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) క్లర్క్ పోస్టులకు ఉండే పోటి చాలా ఎక్కువ. మరికొద్ది రోజుల్లో ఐబీపీఎస్ ప్రిలిమ్స్‌కు పరీక్ష జరగనుండగా.. ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్లు అడ్మిట్ కార్డ్(Admit card) కోసం వెయిట్ చేస్తున్నారు. 4,000 కంటే ఎక్కువ ఖాళీల కోసం ఐబీపీఎస్ గతంలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. IBPS పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ పరీక్ష ఆగస్టు 26, 27 తేదీల్లో, రెండో దశ అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఏ సమయంలోనైనా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత, అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి దశలు:
IBPS Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్.. ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎప్పుడంటే?
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల(ఆగస్టు) 26, 27 తేదీల్లో మొదటి దశ పరీక్ష ఉంది. లక్షలాది మంది పోటి పడే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఏ క్షణంలోనైనా దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. మొత్తం 4,545 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనుంది ఐబీపీఎస్.
Translate this News: